రాఖీ సావంత్ భర్త అరెస్ట్!
on Feb 7, 2023
రాఖీ సావంత్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారింది. ఆదిల్ ఖాన్ దురానీని ఎంత హడావిడిగా పెళ్లిచేసుకుందో, అంతే త్వరగా అతడి నుంచి విడిపోయింది. తాజాగా ఆమె ముంబైలోని ఓషివరా పోలీస్ స్టేషన్ దగ్గర ప్రత్యక్షమైంది. ఆమె భర్త ఆదిల్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తను ఇచ్చిన ఫిర్యాదు వల్లే పోలీసులు అతడిని అరెస్ట్ చేశారని చెప్పి షాకిచ్చింది రాఖీ.
"నేను ఇచ్చిన కంప్లైంట్ వల్లే అతను అరెస్టయ్యాడు. ఇది డ్రామా కాదు. అతను నా జీవితాన్ని నాశనం చేశాదు. అతను నన్ను కొట్టాడు. నా డబ్బును తీసుకొనిపోయాడు" అని ఒక ఆడియో స్టేట్మెంట్ ద్వారా రాఖీ వెల్లడించింది.
అంతకు ముందు ఆదిల్ నుంచి విడిపోతున్నట్లు ఆమె ప్రకటించింది. అతను తనను మోసం చేశాడనీ, అక్రమ సంబంధాల కోసం తమ పెళ్లిని సీక్రెట్‌గా ఉంచాడనీ ఆరోపించింది. తను అనే గాళ్‌ఫ్రెండ్‌తో ఆదిల్ ఉన్న ఫొటోలను సైతం రాఖీ షేర్ చేసింది.
"ఆ తర్వాత రోజు, మీడియా ద్వారా తనకు క్షమాపణలు చెప్పాలని అతను అడిగాడు. నేను క్షమాపణలు చెప్పాకే తిరిగొస్తానని అన్నాడు. అన్నింటినీ వదిలేసి తిరిగొస్తానన్నాడు కానీ అతను రాలేదు. ఆ అమ్మాయితో కలిసి ఉంటున్నాడు. ఆమెకు సిగ్గు లేదు. ఫైనల్‌గా ఆదిల్ నన్ను వదిలిపెట్టిపోయాడు. ఇప్పుడు, మీడియాతో అన్నీ పంచుకుంటున్నాను" అని చెప్పుకొచ్చింది రాఖీ.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
